News October 23, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 20, 2025
జిల్లాలో గత 4 నెలలో 7,432 ఎపిక్ కార్డులు: కలెక్టర్

జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను పంపినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆమె వివరాలను వెల్లడించారు. ఓటు నమోదుకు వచ్చిన 3,334 దరఖాస్తుల్లో 2,800 దరఖాస్తులను ఆమోదించామని, 426 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయని, మరో 108 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
News November 20, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.


