News October 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 8, 2025

బెళుగుప్ప: బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

image

బెలుగుప్ప – వెంకటాద్రి పల్లి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వెంకటాద్రిపల్లికి చెందిన చంద్రమౌళి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి (63) మృతి చెందగా, తిప్పే స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.