News April 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 6, 2025

ఇండిగో CEOపై చర్యలు, భారీ ఫైన్?

image

విమాన కార్యకలాపాల నిర్వహణలో ఫెయిలైన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌ను సస్పెండ్ చేసే ఆలోచనలో విమానయాన శాఖ ఉందని తెలుస్తోంది. వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు ఇండిగో సర్వీసులను తగ్గించాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. FDTL అమలులో నిర్లక్ష్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని కేంద్రం భావిస్తోంది. కాగా, ఆ రూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

News December 6, 2025

ప్రైవేటు బిల్లులు.. చట్టాలుగా మారుతాయా?

image

సాధారణంగా పార్లమెంటులో మంత్రులు బిల్లులను ప్రవేశపెడతారు. కానీ ఏదైనా తీవ్రమైన అంశం చట్టంగా మారాలని భావిస్తే ఎంపీలూ <<18487853>>ప్రైవేటు<<>> బిల్లులను ప్రతిపాదించవచ్చు. దీనికి ఒక నెల ముందు స్పీకర్, ఛైర్మన్‌కు నోటీసు ఇవ్వాలి. 1952 నుంచి 300కు పైగా ప్రైవేటు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. అయితే 14 బిల్లులే చట్టాలుగా మారాయి. వాటిలో ముస్లిం వక్ఫ్, ఇండియన్ రిజిస్ట్రేషన్, హిందూ వివాహం(సవరణ), IPC(సవరణ) బిల్లులు ముఖ్యమైనవి.

News December 6, 2025

జీఎస్టీ&సెంట్రల్ ఎక్సైజ్ చెన్నైలో ఉద్యోగాలు

image

జీఎస్టీ కమిషనర్&సెంట్రల్ ఎక్సైజ్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్, MTS పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన వారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://gstchennai.gov.in/