News November 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 2, 2026

రోజ్ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

image

గులాబీ నూనెకు యాంటీసెప్టిక్‌, యాస్ట్రిజెంట్‌ గుణాలు ఎక్కువ. వేడినీటిలో కాస్త రోజ్‌ ఆయిల్‌ని వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మం తేమగా మారుతుంది. వెన్న, బ్రౌన్‌ షుగర్‌, రోజ్ ఆయిల్ కలిపి శరీరానికి రాసుకుంటే ఇది సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఆలివ్‌, రోజ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజ తేమను పొంది, బలంగా మారుతుంది.

News January 2, 2026

మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు(2/2)

image

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.

News January 2, 2026

విష్ణుమూర్తి పవళించే ‘వామకుక్షి’ భంగిమతో.. సంపూర్ణ ఆరోగ్యం!

image

‘దైవ రూపాలు మన జీవనశైలికి దిశానిర్దేశాలు’ అనేందుకు విష్ణుమూర్తి పవళించే విధానమే నిదర్శనం. ఆయన ఎడమ వైపునకు ఒరిగి ఉండే ఈ స్థితిని వామకుక్షి అంటారు. ఈ భంగిమలో శరీరం విశ్రాంతి తీసుకున్నా, మెదడు చురుగ్గా పని చేస్తుంది. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత ఇలా నిద్రిస్తే జీర్ణక్రియ, రక్తప్రసరణ మెరుగవ్వడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దైవ స్వరూపాల్లో దాగి ఉన్న మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.