News November 8, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 4, 2025
‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
News December 4, 2025
పుతిన్ ఇష్టపడే ఆహారం ఇదే!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్‌కు రానున్నారు. ఆయన PM మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేస్తారని సమాచారం. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్‌క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్‌కు ప్రాధాన్యమిస్తారు.
News December 4, 2025
రూ.50లక్షలతో మూవీ తీస్తే రూ.100కోట్లు వచ్చాయ్!

గుజరాతీ సినిమా చరిత్రలో ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్రం రికార్డు సృష్టించింది. కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 19,900% ప్రాఫిట్స్‌తో రూ.100 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ లేకపోయినా కథలో బలం, మౌత్ టాక్ ద్వారా సినిమా ఇంతటి విజయం సాధించిందని తెలిపాయి. కాగా రిలీజైన ఏడో వారం కూడా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.


