News November 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 5, 2025
తిరుమల: సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ 8న

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్పటి TTD ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ సిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం దీనిపై వాదనలు జరిగాయి. సిట్ 5 రోజుల కస్టడీ కోరగా నెల్లూరు ACB కోర్టు 8వ తేదీ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
News December 4, 2025
సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.
News December 4, 2025
ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.


