News November 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 12, 2025

మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

image

‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.

News November 12, 2025

బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

image

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్‌<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

News November 12, 2025

నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

image

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్‌పై ప్రభావం చూపింది.