News November 25, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 23, 2025
ASF: కాంగ్రెస్లో ఆదివాసీ మహిళకు అగ్రస్థానం

ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ నియమితులయ్యారు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుగుణ కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మానవ హక్కుల వేదిక, ఆదివాసీ మహిళా కార్యకర్తగా ఆమెకు గుర్తింపు. TPCC ఉపాధ్యక్షురాలిగా పని చేస్తూనే, లోక్సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చారు. ఆమె అంకితభావం, ఆదివాసీ సమాజంలో పలుకుబడి పార్టీకి బలంగా మారుతుందని భావించి బాధ్యతలు కట్టబెట్టారు.
News November 23, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://westgodavari.ap.gov.in/
News November 23, 2025
చలికాలంలో కర్లీ హెయిర్ ఇలా సంరక్షించండి

చలి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ముఖ్యంగా కర్లీ హెయిర్ త్వరగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. హెయిర్ సీరమ్, కండిషనర్లు, క్లెన్సర్లలో కాస్త తేనె కలిపి రాసుకోవడం, కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలతో మసాజ్ చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.


