News March 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 26, 2025

మొంథా తుఫాను పయనమిలా..

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 26, 2025

నాతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదు: కవిత

image

TG: తనతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా NZBలో మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టాం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం KCRకు లేదు. KCRను, BRSను ఇష్యూ బేస్డ్‌గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నావ. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వటమేంటి?’ అని వ్యాఖ్యానించారు.

News October 26, 2025

రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

image

AP: ‘మొంథా’ తుఫాను ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. SKL, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గో., ఏలూరు, NTR, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.