News November 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 26, 2025

NRPT: వీసీసీఎం పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్‌ విడుదల

image

నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే వాక్సిన్ కోల్డ్ చైన్ మొబిలైజర్ (VCCM) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను నవంబర్ 26 నుంచి డిసెంబర్ 28 వరకు చూడవచ్చని డీఎంహెచ్‌ఓ కె.జయచంద్రమోహన్ తెలిపారు. అభ్యంతరాలను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నివేదించవచ్చు.

News November 26, 2025

మెదక్: మల్లన్న సాగర్‌ నీ తాత కట్టిండా.? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్‌.!

image

మల్లన్న సాగర్‌ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కాంగ్రెస్ హయంలో చెరువులు, చెక్ డ్యామ్‌ల పేల్చివేత నిత్య చర్యగా మారిందన్నారు.

News November 26, 2025

పరకామణి కేసు.. ఎస్టేట్ విభాగంపై విచారణ.!

image

తిరుమల పరకామణి కేసులో ఎస్టేట్ విభాగానికి సంబంధించి మంగళవారం పూర్తిస్థాయి విచారణ సాగినట్లు సమాచారం. రవి కుమార్ ఆస్తులు బదిలీ, ఎలా ఎప్పుడు తీసుకున్నారు. ఎవరు మధ్యవర్తిత్వం చేశారన్న విషయంపై మాట్లాడారు. దానిలో ఎవరిపాత్ర ఉందనే అంశాలపై సీఐడీ అధికారులు విచారించారు. అసలు ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఆస్తుల విరాళానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేకోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.