News November 30, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 22, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2200, కనిష్ఠ ధర రూ.1700; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2155, కనిష్ఠ ధర రూ.1900; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2300, కనిష్ఠ ధర రూ.2201; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2250, కనిష్ఠ ధర రూ.2150; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2915, కనిష్ఠ ధర రూ.2150గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 22, 2025
SRHలోనే విధ్వంసకర బ్యాటర్లు

మినీ వేలం వేళ హిట్టర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ను SRH విడిచిపెట్టనుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ యాజమాన్యం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. తాజాగా ఈ విధ్వంసకర వీరులిద్దరి ఫొటోలను SRH ట్వీట్ చేసింది. టాప్ ఆర్డర్లో హెడ్, మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ ‘ఫైర్ పవర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ వీరిద్దరూ ఊచకోత కోయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 22, 2025
త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.


