News December 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 1, 2025

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

News December 1, 2025

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

image

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.

News December 1, 2025

దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.