News December 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 7, 2025

కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

image

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.

News December 7, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్‌గా జో రూట్ ఖాతాలో అన్‌వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.

News December 7, 2025

సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్‌నాథ్ సింగ్

image

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్‌లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్ ఈ కామెంట్లు చేశారు.