News April 13, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 19, 2026
అనుష్క పెళ్లి.. టీమ్ క్లారిటీ

ఈ ఏడాదే అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్‌ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. అధికారిక సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అలాగే అనుష్క ఏజ్‌కు సంబంధించిన ప్రస్తావన పదే పదే తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.
News March 19, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News March 19, 2026
భీకర స్థాయికి యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై యుద్ధాన్ని భీకర స్థాయికి తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వేలాది US బలగాలను పశ్చిమాసియాకు తరలించే యోచన చేస్తున్నట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు రక్షణ కల్పించడంతోపాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికీ వారిని పంపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమని ఓ అధికారి చెప్పినట్లు వివరించింది.


