News December 14, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 28, 2025
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.
News November 28, 2025
ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసుకోండి!

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్‌ను<<>> అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్‌లో ‘Aadhaar’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.
News November 28, 2025
గంభీర్ తీరుపై బీసీసీఐ అసంతృప్తి.. ఇదే ఫైనల్ ఛాన్స్?

IND హెడ్ కోచ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన <<18393677>>స్టేట్మెంట్లపై<<>> BCCI అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతనికి బోర్డు సపోర్ట్ ఉన్నప్పటికీ, స్వదేశంలో జరిగే T20 WC రిజల్ట్స్‌ను బట్టి అది మారొచ్చని తెలిపింది. 2026 AUG వరకు స్వదేశంలో టెస్టులు లేకపోవడంతో టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి ఇప్పట్లో తొలగించకపోవచ్చని అంచనా వేసింది. SAతో టెస్ట్ సిరీస్ ఓడిన అనంతరం గంభీర్‌పై విమర్శలొచ్చాయి.


