News December 21, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News September 17, 2025
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.
News September 17, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.