News December 21, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.
News November 2, 2025
ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్

ఎన్నో రహస్యాలకు నెలవైన నింగికి చందమామే అందం. ఆ చంద్రుడు ఈ నెల 5న మరింత పెద్దగా, కాంతిమంతంగా కనివిందు చేయనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే బీవర్ సూపర్ మూన్గా నిలవనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ రోజున జాబిలి భూమికి 356,980KM దగ్గరకు వస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదంటున్నారు. కాగా డిసెంబర్లోనూ ఓ కోల్డ్ మూన్ అలరించనుంది.


