News December 31, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 23, 2026
350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 23, 2026
నేడు శ్రీవారి పలు దర్శన టోకెన్లు విడుదల

AP: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి సంబంధించి పలు సేవల టోకెన్లు ఇవాళ రిలీజ్ కానున్నాయి. శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా ఉదయం 10గంటలకు TTD విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టోకెన్లు 3pmకు విడుదల చేయనున్నారు. అటు అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని, దళారులను నమ్మొద్దని TTD హెచ్చరిస్తోంది.
News January 23, 2026
AP SETకు అప్లై చేశారా?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET-2025)కు అప్లై చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడేందుకు సెట్ అర్హత తప్పనిసరి. పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.apset.net.in


