News January 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 3, 2025
మార్కెట్లోకి రూ.5,000 నోట్లు.. క్లారిటీ
త్వరలో రూ.5,000 నోట్లు మార్కెట్లోకి రానున్నాయనే ప్రచారాన్ని RBI కొట్టిపారేసింది. అలాంటిదేమీ లేదని తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 నోట్లే చలామణిలో ఉన్నాయని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రస్తుత కరెన్సీ వ్యవస్థ సరిపోతుందని చెప్పింది. ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలూ ఆ దిశగానే మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.
News January 3, 2025
HMPV వ్యాప్తి తక్కువే: చైనా
చైనాలో కొత్తగా విస్తరిస్తోన్న <<15057647>>HMPV<<>>(Human metapneumovirus)పై ఆ దేశం స్పందించింది. దాని తీవ్రతను తక్కువచేసే ప్రయత్నం చేసింది. ‘ప్రతి వింటర్‌లో ఉత్తరార్ధగోళంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తి ఉంది. చైనా పౌరులతో పాటు విదేశీయుల ఆరోగ్యంపై మేం శ్రద్ధ చూపిస్తాం. చైనాలో పర్యటించడం సురక్షితమే’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
News January 3, 2025
జీవాంజి దీప్తికి చిరు సత్కారం
పారా ఒలింపిక్ విజేత, తెలుగమ్మాయి జీవాంజి దీప్తిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆమెకు శాలువా కప్పి, రూ.3 లక్షల నగదు పురస్కారం అందించారు. అనంతరం అక్కడ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కాగా దీప్తి ఒలింపిక్ మెడల్ సాధించినప్పుడు చిరంజీవిని కలవడం తన కల అని చెప్పినట్లు పుల్లెల గోపీచంద్ తెలిపారు.