News January 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 4, 2025
దేశంలో ఎడమ చేతి వాటం కలిగిన వారెందరంటే?
క్లాసులో వంద మంది ఉంటే అందులో ఒకరో, ఇద్దరో ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులుంటారు. అంటే, ఇలాంటి స్పెషల్ వ్యక్తులు చాలా అరుదన్నమాట. భారతదేశ జనాభాలో వీరు 5.20శాతం మంది ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 13.10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండగా 12.80శాతంతో కెనడా రెండో స్థానంలో ఉంది. UKలో 12.24%, ఫ్రాన్స్‌లో 11.15%, ఇటలీలో 10.51%, జర్మనీలో 9.83శాతం మంది ఉన్నారు. మీకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఉన్నారా?
News January 4, 2025
మేం ఇచ్చిన హామీలు మాకు తెలుసు: మంత్రి పయ్యావుల
AP: తాము ఇచ్చిన హామీలు తమకు తెలుసని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు. ‘వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దేశంలోని మరే రాష్ట్రానికి ఇన్ని అప్పులు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
News January 4, 2025
700 మంది అమ్మాయిలను మోసం చేశాడు
తాను US మోడల్‌నని చెబుతూ 700 మంది అమ్మాయిలను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నోయిడాకు చెందిన తుషార్(23) డేటింగ్ యాప్స్, స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోలను పెట్టుకుని అనేక మంది యువతులను బుట్టలో వేసుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు సేకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు వసూలుచేసేవాడు. ఓ యువతి ఫిర్యాదుతో అతని బండారం బయటపడింది.