News January 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 7, 2025
నేటి ముఖ్యాంశాలు
* చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
* దేశంలో 6 hMPV వైరస్ కేసులు నమోదు
* అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేంద్రం సూచన
* ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ఆస్పత్రుల అసోసియేషన్
* TG: ఏసీబీ విచారణకు హాజరుకాని కేటీఆర్
* ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి 8 మంది జవాన్ల మృతి
News January 7, 2025
కేటీఆర్ విజ్ఞప్తికి అంగీకరించిన ఈడీ
TG: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో KTR విజ్ఞప్తికి ED అంగీకరించింది. రేపు కోర్టు తీర్పు ఉన్నందున్న తాను విచారణకు రాలేనని ఆయన ఈడీకి లేఖ పంపిన విషయం తెలిసిందే. దీంతో రేపటి విచారణ నుంచి KTRకు మినహాయింపు ఇచ్చింది. అటు ఇదే కేసులో ఇవాళ ACB కార్యాలయం వరకు వెళ్లిన ఆయన తన లాయర్ను లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో ACB మరోసారి KTRకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని సూచించింది.
News January 7, 2025
కెనడా ప్రధాని రాజీనామా.. తర్వాత ఏం జరుగుతుంది?
కెనడా PM, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అక్కడి చట్టాల ప్రకారం అధికార పార్టీ నేత రాజీనామా చేస్తే 90 రోజుల్లో కొత్తవారిని ఎన్నుకోవాలి. రేసులో మార్క్ కార్నే, ఫ్రాంకోయిస్, క్రిస్టియా, మెలానీ జోలీ, డొమినిక్ ఉన్నారు. బుధవారం పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కెనడాలో OCTలో ఎన్నికలు జరుగుతాయి.