News January 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 21, 2025
లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.
News November 21, 2025
లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-2

పెట్టుబడిదారులు తొలుత బంగారాన్ని లీజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా ఆర్థిక సంస్థకు ఇస్తారు. ఆ సంస్థ నుంచి గోల్డ్‌ను జువెలర్లు తీసుకుని ఆభరణాలు తయారు చేసి అమ్ముకుంటారు. ఇన్వెస్టర్లకు లీజ్ రేట్ ప్రకారం డబ్బు చెల్లిస్తారు. గడువు పూర్తయ్యాక బంగారాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి ఇస్తారు. లేదా లీజ్ రెన్యూవల్ చేసుకుంటారు. అయితే జువెలర్లు దివాళా తీస్తే గోల్డ్ రికవరీ కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 21, 2025
జడేజాను వదులుకోవడంపై ఆశ్చర్యపోయా: కుంబ్లే

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను CSK వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నారు. ‘మామూలుగా CSK తమ ప్లేయర్లను వదులుకోదు. ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగుతున్న జడేజా లాంటి వారిని అస్సలు వెళ్లనివ్వదు’ అని చెప్పారు. జడేజాను రాజస్థాన్, శాంసన్‌ను CSK తీసుకోవడం పెద్ద పరిణామం అని తెలిపారు. అయితే జడేజాకు RR మేనేజ్మెంట్ కెప్టెన్సీ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న అన్నారు.


