News January 12, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News November 20, 2025
పోలీసులకు సవాల్‌గా సీపీఎం నేత హత్య కేసు

పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్యకేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 20 రోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని, ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యను కిరాయి హంతకులు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ఆధారాలు లభించడం లేదు. అనుమానితులను విచారించినా దోషులు దొరకకపోవడంతో, సీపీఎం ఈ నెల 25 నుంచి దశలవారీగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.


