News January 23, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News January 23, 2025
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
TG: ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, త్వరగా వాటిని భర్తీ చేయాలని MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. BRS నోటిఫికేషన్లను పూర్తి చేసి తమవిగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. వయసు పెంచితే 40వేల ఉద్యోగాలకు గండి పడుతుందని చెప్పారు.
News January 23, 2025
రైలు ప్రమాదం వేదనకు గురిచేసింది: PM మోదీ
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తనను వేదనకు గురిచేసిందని PM మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయనే వదంతులతో ప్రయాణికులు చైన్ లాగి కిందకు దిగారు. పక్క ట్రాకుపై వెళ్తోన్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లగా 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 23, 2025
రోజూ యాలకులు తింటున్నారా!
ప్రతి రోజు యాలకులను నమిలి రసం మింగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే యాలకులను డైలీ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తశాతం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తశుద్ధి జరిగి విష, వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.