News January 27, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News December 9, 2025

శాంసన్‌కు మరోసారి అన్యాయం: ఫ్యాన్స్

image

SAతో తొలి T20లో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సంజూకి అన్యాయం జరిగిందని, ఫామ్‌‌లో లేని కొందరు ప్లేయర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ చేస్తోందని SMలో పోస్టులు పెడుతున్నారు. SAతో గత T20 సిరీస్‌లో శాంసన్ 2 సెంచరీలు చేశారని, గిల్ కంటే సంజూ బ్యాటింగ్ Avg, SR మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్లేయింగ్‌11లో ఉండేందుకు సంజూ అర్హుడని పేర్కొంటున్నారు.

News December 9, 2025

తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచి: భట్టి

image

తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్-2047 ఓ దిక్సూచి అని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఓ గదిలో కూర్చొని దీన్ని రూపొందించలేదని, విస్తృత సంప్రదింపులు, అనేక అభిప్రాయాల తర్వాతే దీనికి రూపు తెచ్చామని గ్లోబల్ సమ్మిట్‌లో వివరించారు. సమ్మిళిత వృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమ్మిట్‌కు విభిన్న ఆలోచనలతో వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు.

News December 9, 2025

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

image

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.