News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News January 25, 2026
రథ సప్తమి గురించి ‘యోగశాస్త్రం’ ఏం చెబుతుందంటే..?

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఇడా, పింగళ అనే 2 నాడులుంటాయి. ఇందులో పింగళ నాడి సూర్య నాడికి సంకేతం. ప్రాణాయామం ద్వారా ఈ నాడులను శుద్ధి చేసినప్పుడు కుండలినీ శక్తి మేల్కొంటుంది. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే, యోగ సాధన ద్వారా మనలోని చిదాత్మ ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు చేసే సాధన మనలోని ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. అందుకే ఈ పర్వదినాన కొద్దిసేపైనా యోగా చేయాలని పండితులు సూచిస్తారు.
News January 25, 2026
నేడే మూడో టీ20.. గెలిస్తే భారత్‌దే సిరీస్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు గువాహటిలో 3rd T20 జరగనుంది. ఇప్పటికే తొలి 2 మ్యాచులు గెలిచిన IND ఇందులోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అక్షర్, బుమ్రా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోసారి 200+ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా.
IND XI (అంచనా): అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ, అక్షర్/కుల్దీప్, బుమ్రా/హర్షిత్, అర్ష్‌దీప్, వరుణ్
LIVE: 7PM నుంచి Star Sports, Hotstar
News January 25, 2026
యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు

యాలకుల్లో ఉండే జింక్, ఐరన్, విటమిన్ సి, రిబోఫ్లావిన్, సల్ఫర్, నియాసిన్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన పోతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాసకోశ సమస్యలు పోతాయి. వీటిలోని ఎంజైమ్‌లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి’ అని అంటున్నారు.


