News February 12, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News November 26, 2025

నిరక్షరాస్యుల కోసం ‘అక్షరాంధ్ర’

image

APలో 15-59 ఏళ్ల వయసున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవడం, రాయడంతోపాటు కూడికలు, తీసివేతలను నేర్పిస్తారు. డిజిటల్, ఫైనాన్షియల్, హెల్త్, న్యాయ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను ఇందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం 81L మంది నిరక్షరాస్యులుండగా ఏటా 25L మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.

News November 26, 2025

జిల్లాలు, డివిజన్లు, మండలాల లెక్క ఇదే!

image

ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాలు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు, పెద్దహరివాణం మండలం ఏర్పడతాయి. మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు అవుతాయి.

News November 26, 2025

ఇంటర్వ్యూతో ఐఐసీటీలో ఉద్యోగాల భర్తీ

image

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<>IICT<<>>)16 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు రేపు ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://iict.res.in/