News March 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.

News November 28, 2025

NZB: ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకాగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలని కలెక్టర్ కోరారు.

News November 28, 2025

KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

image

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.