News March 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News March 3, 2025
చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ

‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్ను అడుగుతుంటా’ అని ఇటీవల చిరంజీవి చేసిన <<15434876>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు.
News March 3, 2025
ఇండియన్ని కాల్చిచంపిన జోర్డాన్ ఆర్మీ

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయిల్లోకి ప్రవేశిస్తున్న భారతీయుణ్నిఅక్కడి బలగాలు కాల్చిచంపాయి. కేరళకు చెందిన థామస్ గాబ్రియల్, ఎడిసన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా సరిహద్దు దాటాలని ప్రయత్నించగా ఆర్మీ కాల్పులు జరిపింది. థామస్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. వీరిద్దరూ టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
News March 3, 2025
టైమ్ లేదు.. తక్షణమే పిల్లల్ని కనండి: TN CM

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలని TN CM స్టాలిన్ కోరారు. రాష్ట్రం విజయవంతంగా అమలు చేసిన ఫ్యామిలీ ప్లానింగే ఇప్పుడు డిస్అడ్వాంటేజీగా మారిందన్నారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తన మొర ఆలకించాలని కోరారు. ‘గతంలో కొంత టైమ్ తీసుకొని పిల్లల్ని కనాలని చెప్పేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. మనమిది చెప్పాల్సిందే’ అని అన్నారు.