News March 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News December 2, 2025
నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.
News December 2, 2025
అలా చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు: నాగ చైతన్య

సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని తన వెబ్ సిరీస్ ‘దూత’ నిరూపించిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘దూత’ రిలీజై రెండేళ్లైన సందర్భంగా SMలో పోస్ట్ పెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే సీజన్-2 ఎప్పుడు అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో వచ్చిన దూతలో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో చైతన్య మెప్పించారు.
News December 2, 2025
ప్రదోషాల గురించి మీకు ఇవి తెలుసా?

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోషం అంటారు. ఆ తిథి ఏ వారంలో వస్తుందో దాన్ని బట్టి ఆ ప్రదోషానికి ప్రత్యేక నామం ఉంటుంది.
త్రయోదశి తిథి ఆదివారం వస్తే రవి ప్రదోషం. సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం. మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. బుధవారం వస్తే బుధ ప్రదోషం. గురువారం వస్తే గురు ప్రదోషం. శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం. శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు.


