News March 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

Similar News

News December 30, 2025

IMA నుంచి తొలి మహిళా ఆఫీసర్

image

డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్‌ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్‌ క్యాడెట్‌లు పాసవుట్‌ పరేడ్‌ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది సాయి జాదవ్.

News December 30, 2025

2025లో వీళ్లే టీమ్ ఇండియా స్టార్‌లు: అశ్విన్‌

image

భారత మాజీ క్రికెటర్ అశ్విన్ 2025లో తన దృష్టిలో బెస్ట్ ప్లేయర్లు ఎవరో ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. వరుణ్ చక్రవర్తిని ‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేశారు. 2026 T20 వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అలాగే అభిషేక్ శర్మను ఈ ఏడాది అత్యుత్తమ బ్యాటర్‌ అని, నెక్స్ట్-జనరేషన్ Xఫాక్టర్‌గా అభివర్ణించారు. ఇక రోహిత్, కోహ్లీ ODI వరల్డ్‌కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.

News December 30, 2025

ప్రసార భారతిలో ఉద్యోగాలు

image

<>ప్రసార భారతి<<>>, న్యూఢిల్లీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, PG డిప్లొమా(జర్నలిజం), మాస్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషలో ప్రావీణ్యం ఉండాలి. కాపీ రైటర్‌కు నెలకు రూ.55వేలు, కాపీ ఎడిటర్‌కు రూ.80వేల వరకు జీతం చెల్లిస్తారు. రాత పరీక్ష / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in