News April 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 5, 2026

ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

image

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 5, 2026

30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

image

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.

News March 5, 2026

ఖమేనీ మృతిపై సంతాపం తెలిపిన భారత్

image

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఆయన మరణానికి సంతాపం తెలియజేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్వయంగా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి రాయబారులతో మాట్లాడారు. అక్కడ సంతాప సందేశ బుక్‌పై సంతకం చేశారు. కాగా ఖమేనీ మృతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.