News March 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 2, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>IOL<<>>) దులియాజాన్‌లో 16 కాంట్రాక్టువల్ డ్రిల్లింగ్/వర్క్ఓవర్ ఆపరేటర్, వర్క్‌ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://www.oil-india.com/ను సంప్రదించండి.

News November 2, 2025

ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

image

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది

News November 2, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.