News March 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 20, 2025
మహబూబాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 20, 2025
HCA మాజీ కోశాధికారి ఆస్తి సీజ్

TG: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ED రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది.
News March 20, 2025
ఆర్ఆర్‌బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1, 2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏ సెంటర్లనోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది సీబీటీ-1 నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.