News March 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 31, 2026
Op Sindoor: 10 నిమిషాల్లో 40 కోట్ల సైబర్ దాడులు!

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) వెబ్సైట్పై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు సంస్థ సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ తెలిపారు. కేవలం 10 నిమిషాల్లోనే 40 కోట్ల దాడులు చేశారని చెప్పారు. వెబ్సైట్ను షట్డౌన్ చేయించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. NSEపై సగటున రోజుకు 20 కోట్ల సైబర్ దాడులు జరుగుతున్నాయని, వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.
News January 31, 2026
టాస్ గెలిచిన భారత్

NZతో తిరువనంతపురంలో జరిగే చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 టీ20ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
భారత్: శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, సూర్య(C), రింకూ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
News January 31, 2026
గంగా నది ఎలా పుట్టిందో తెలుసా?

గంగానది పుట్టుక వెనుక భగీరథుని తపస్సు కారణం. సగరుని కుమారుల ఆత్మలకు మోక్షం ప్రసాదించేందుకు భగీరథుడు స్వర్గలోక వాసిని అయిన గంగను భూమికి రప్పించాడు. అయితే గంగా ప్రవాహ వేగాన్ని తట్టుకోవడానికి శివుడు ఆమెను తన జటాజూటంలో బంధించి, నేలకు మెల్లగా విడుదల చేశాడు. ఇలా భౌతిక ప్రపంచానికి వచ్చిన గంగ, పితృదేవతలను ఉద్ధరించి పవిత్ర నదిగా వెలుగొందుతోంది. అందుకే ప్రతి భారతీయుడు ఒక్కసారైనా గంగా నదిలో స్నానమాచరించాలి.


