News March 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
Similar News
News March 22, 2025
కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం

AP: కేంద్ర ప్రాయోజిత పథకాలు, రావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదు కేంద్ర శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని అధికారులు చెప్పగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాబట్టాలని ఆదేశించారు. కేంద్రం అడిగిన సమగ్ర సమాచారాన్ని అందించి నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సూచించారు.
News March 22, 2025
టాక్సిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీని వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వైల్డ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ చేస్తుండగా, కియారా, నయనతార, హుమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. KGF-2 తర్వాత యశ్ నటిస్తున్న సినిమా ఇదే.
News March 22, 2025
1 స్కీమ్: ₹1.61LCR పెట్టుబడి, 11.5లక్షల జాబ్స్

PLI స్కీమ్స్తో ₹1.61L CR పెట్టుబడులు, ₹14L CR ప్రొడక్షన్, ₹5.31L CR ఎగుమతులు నమోదయ్యాయని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.5లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. 14 రంగాల్లో 764 దరఖాస్తుల్ని ఆమోదించామని పేర్కొంది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజులు, ఫార్మా, టెలికం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, డ్రోన్స్ రంగాల్లో 176 MSMEలు లబ్ధి పొందాయని వెల్లడించింది.