News March 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 22, 2025

ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

image

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News March 22, 2025

నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <>ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు<<>> స్వీకరిస్తున్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు.

News March 22, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.

error: Content is protected !!