News March 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 25, 2025
టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. 9 మందిపై కేసు

AP: కడప(D) వల్లూరులో నిన్న మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ వెల్లడించారు. వాటర్ బాయ్ సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్కి వాట్సాప్ చేసినట్లు ఆయన వివరించిన విషయం తెలిసిందే.
News March 25, 2025
IPL: మ్యాక్స్వెల్ చెత్త రికార్డు

ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు(19) సున్నాకే వెనుదిరిగిన ప్లేయర్గా ఆయన నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(18), దినేశ్ కార్తీక్(18), పియూశ్ చావ్లా(16), సునీల్ నరైన్(16) ఉన్నారు.
News March 25, 2025
ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా ఎప్పటినుంచంటే?

పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని మే నెలాఖరు లేదా జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. అయితే విత్డ్రా లిమిట్పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.