News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News February 2, 2026
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలతో మేలు

☛ సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ☛ ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. ☛ తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. ☛ మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. ☛ మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. ☛ చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News February 2, 2026
KTRది నియంతృత్వ, రాచరికపు పోకడ: కవిత

TG: KCRను విచారణకు పిలవడమే నేరమన్నట్లు KTR మాట్లాడుతున్నారని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘అభ్యర్థి చెడ్డోడైనా KCRను చూసి ఓటేయాలని మీరు కోరడమేమిటి? అది మీ రాచరికపు, నియంతృత్వపు పోకడకు నిదర్శనం. ఈ వైఖరి మారనంతవరకూ BRSను ఎవరూ కాపాడలేరు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జాగృతి తరఫున మంచి అభ్యర్థులను పెడుతున్నాం. ఆదుకొనే వారినే ప్రజలు ఎన్నుకోవాలి. FEB 20 తర్వాత ‘జనం బాట’ చేపడతాం’ అని కవిత తెలిపారు.
News February 2, 2026
ధురంధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ గాంధీ.. అసలు విషయం ఇదీ

ధురంధర్ విషయంలో ఒక క్రేజీ న్యూస్ SMను ఊపేస్తోంది. సినిమా క్రెడిట్స్‌లో ‘ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాహుల్ గాంధీ’ అని కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సినిమా రంగంలోకి వచ్చారా? అంటూ పోస్టులతో రచ్చ చేస్తున్నారు. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత కాదు. బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ వెనకున్న సీనియర్ ప్రొడ్యూసర్. పేరు కలవడంతో వచ్చిన గందరగోళం అంతే!


