News March 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 19, 2025

దీపావళికి తాబేలును ఎందుకు కొంటారు?

image

దీపావళి సందర్భంగా తాబేలును ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అనేది విష్ణుమూర్తి కూర్మావతారానికి ప్రతీక. అందుకే అనేక ఆలయ కోనేట్లలో తాబేళ్లను వదులుతారు. దీపావళి రోజున దీన్ని ఇంటికి తేవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘాయుష్షుకు సంకేతమైన ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని భావిస్తారు.

News October 19, 2025

శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు

image

అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచులోనే ఓటమి చవిచూసిన కెప్టెన్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరారు. భారత్ నుంచి ఈ లిస్టులో అతనితో పాటు కోహ్లీ ఉన్నారు. గిల్ గత ఏడాది జింబాబ్వే చేతిలో టీ20 మ్యాచ్ ఓడగా, ఈ ఏడాది టెస్ట్ (vsENG), ODI(vsAUS)లో పరాజయం పాలయ్యారు. కాగా ఈ ఏడాది వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే తొలి ఓటమి. వరుసగా 8 విజయాలు సాధించిన తర్వాత ఇవాళ AUSతో మ్యాచులో ఓడింది.

News October 19, 2025

రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి: సీఎం చంద్రబాబు

image

AP: చీకట్లను పారద్రోలి వెలుగుల్ని తీసుకువచ్చే పండుగ దీపావళి అని CM CBN అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలి. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి’ అని ట్వీట్ చేశారు. అటు దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని YS జగన్‌ ఆకాంక్షించారు.