News March 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 1, 2025
రతన్ టాటా వీలునామా.. వెలుగులోకి మరో విషయం

గత ఏడాది కన్నుమూసిన రతన్ టాటాకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిలో అత్యధిక భాగం ఆయన ఛారిటీకి కేటాయించినట్లు ఓ కథనం వెల్లడించింది. దాదాపు రూ.3,800cr సంపదను రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్ట్కు కేటాయిస్తూ వీలునామా రాసినట్లు సమాచారం. అలాగే తన సవతి సోదరీమణులకు ₹800cr, సన్నిహితుడు మొహిన్ ఎం దత్తాకు ₹800cr, ఇతర కుటుంబ సభ్యులకూ ఆస్తులను రాశారు. తన శునకాల సంరక్షణకూ నిధులను కేటాయించారు.
News April 1, 2025
వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు

కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభ ముందుకు తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనాలని ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. విద్యావంతులు, నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారన్నారు. ఇది ముస్లింలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
News April 1, 2025
HCU భూములు కాపాడాలని కేంద్రమంత్రికి వినతి

HCUకి చెందిన 400 ఎకరాల భూమిని కాపాడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను రాష్ట్ర BJP MPలు కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. పచ్చని చెట్లు, దట్టమైన అడవితో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. జింకలు, నెమళ్లు, అరుదైన నక్షత్ర తాబేళ్లు, సరీసృపాలకు ప్రాణాధార చెరువులు ఉన్న ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.