News April 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 3, 2025
RGVపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

AP: డైరెక్టర్ RGVకి<<15667800>> హైకోర్టులో<<>> ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవి రాజకీయ దురుద్దేశంతో పెట్టినవని, కొట్టేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులపై ఇప్పటికే స్టే విధించిన కోర్టు ఇవాళ మరోసారి విచారించింది.
News April 3, 2025
ఎయిర్ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.
News April 3, 2025
BREAKING: SRHతో మ్యాచ్.. KKR భారీ స్కోర్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్లో KKR 200/6 స్కోర్ చేసింది. డికాక్(1), నరైన్(7) విఫలమవగా రఘువంశీ 50, రహానే 38, చివర్లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60, రింకూ సింగ్ 17 బంతుల్లో 32* అదరగొట్టారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.