News April 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 3, 2025

‘పంచాయతీ’ పోరుకు యువత జై!

image

TG: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో యువతే అధికంగా ఉన్నారు. పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్‌లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది. రెండు విడతల్లో 70శాతానికి పైగా నామినేషన్లలో 30-44 ఏళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.

News December 3, 2025

నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.

News December 3, 2025

రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

image

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.