News April 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 13, 2025

బెంగాల్‌లో హిందువులకు రక్షణ లేదు: BJP

image

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర LOP, BJP నేత సువేందు అధికారి స్పందిస్తూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇది సీఎం మమత చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర చీఫ్ మజూందార్ విమర్శించారు. కాగా ముర్షీదాబాద్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్నారు. అల్లర్ల‌ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు.

News April 13, 2025

61 డాట్స్.. 30,500 మొక్కలు నాటాం: KKR

image

CSKతో మ్యాచ్‌లో 61 డాట్ బాల్స్ వేసిన KKR 30,500 మొక్కలను నాటినట్లు ప్రకటించింది. అలీ, నరైన్, వరుణ్, హర్షిత్, వైభవ్ మొక్కలను నాటుతున్నట్లు రూపొందించిన ఫొటోను షేర్ చేసింది. ఒక ఇన్నింగ్సులో ఇన్ని డాట్స్ వేయడం IPL చరిత్రలోనే తొలిసారి. దీంతో చెపాక్ స్టేడియంలో చెట్లతో నిండిపోయిన మీమ్స్ వైరలయ్యాయి. కాగా పర్యావరణ సంరక్షణలో భాగంగా ఒక్కో డాట్‌కు 500 చెట్లు నాటే కార్యక్రమానికి 2023లో BCCI శ్రీకారం చుట్టింది.

News April 13, 2025

మామిడి పండ్లు.. వీటి రుచి చూశారా?

image

వేసవి వచ్చింది. ఎండలతో పాటు మామిడి పండ్లనూ తెచ్చింది. దేశంలో విరివిగా కాసే మామిడిలో ఎన్నో రకాలున్నాయి. బంగినపల్లి, మల్లికా(AP), ఇమామ్ పసంద్(TG), అల్ఫాన్సో(MH), మాల్గోవా, సింధూర, పైరి, తోతాపురి(KN), బాంబే గ్రీన్(MP), ఫజ్లి, గులాభాస్, చౌసా, జర్దాలు(BH), లంగ్రా, దశరి(UP), నీలం, కేసర్(GT), కిషన్ భోగ్, హిమసాగర్(WB)తో పాటు మరెన్నో రకాలున్నాయి. వీటిలో మీరు టేస్ట్ చేసినవి, మీకు తెలిసినవి కామెంట్ చేయండి.

error: Content is protected !!