News April 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 20, 2025

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

News November 20, 2025

మరోసారి KTRను విచారించనున్న ఈడీ?

image

TG: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో KTRను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ అనుమతి తీసుకోనుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్‌ను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే.

News November 20, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

✦ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
✦ బీజేపీలో నాకు ఎవరితోనూ విభేదాలు లేవు: బండి సంజయ్
✦ దానం నాగేందర్, కడియంకి మరోసారి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
✦ టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. HYDలోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు
✦ అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజం: ఈటల