News April 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 16, 2025

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, నిన్న రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మి.మీ. వర్షం పడగా, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది.

News April 16, 2025

పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీ‌రాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతినెలా వీరి జీతాల కోసం రూ.115కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టర్ రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

News April 16, 2025

TGలో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40KM వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

error: Content is protected !!