News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 25, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
News April 25, 2025
గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.
News April 25, 2025
HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

AP: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉ.8కి మొదలవనుంది. మీర్జా రియాజ్(MIM), గౌతంరావు(BJP) పోటీలో ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 112 మందికి గాను 88 మంది ఓటు వేశారు. 45 ఓట్లు వచ్చినవారు విజేతగా నిలుస్తారు. MIMకు సింగిల్‌గానే 50 ఓట్లు ఉండటం, INC(14) కూడా మద్దతివ్వడంతో రియాజ్ గెలుపు లాంఛనమే. ఉ.10 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. BRS సభ్యులు(24) ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.