News August 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 6, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News August 6, 2025
మరోసారి CAB అధ్యక్షుడిగా గంగూలీ?

BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. SEP 20న CAB వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుండగా, దాని కంటే ముందే తాను నామినేషన్ దాఖలు చేస్తానని గంగూలీ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గంగూలీ గతంలోనూ CAB అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం CAB ప్రెసిడెంట్‌గా ఆయన సోదరుడు స్నేహాశిష్ ఉన్నారు.
News August 6, 2025
EP28: వీటికి దూరంగా ఉండాలి: చాణక్య నీతి

ఉన్నత స్థానం పొందాలన్నా గౌరవంగా బతకాలన్నా 3 విషయాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల ముందు తమను తాము ప్రశంసించుకోవద్దు. దీని వల్ల సమాజంలో వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకాన్ని కోల్పోతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎదుటి వారిలో తప్పులు వెతకడం మానుకోవాలి. ఇతరుల్లో తప్పులు వెతికేవారు తమలోని తప్పుల్ని తెలుసుకోలేరు’ అని బోధిస్తోంది.