News August 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 7, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మోదీ ఫైనల్ చేస్తారు: కిరణ్ రిజుజు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఎంపిక చేస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన NDA నేతల కీలక సమావేశం అనంతరం కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘తొలుత కొందరిని నడ్డా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారిలో ఒకరిని మోదీ ఫైనల్ చేస్తారు. వచ్చే నెల 9లోగా అభ్యర్థి పేరు ఖరారు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
News August 7, 2025
ప్రభాస్‌తో కలిసి నటిస్తారా?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం 13 నుంచి 17 ఏళ్ల మధ్యనున్న మేల్ యాక్టర్స్ కావాలని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మూడు ఫొటోలు, రెండు నిమిషాల యాక్టింగ్ వీడియోతో పాటు వివరాలను spirit.bhadrakalipictures@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. అలాగే 7075770364కు కాల్ చేయాలని సూచించారు.
News August 7, 2025
డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్.. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్

TG: కులగణన సర్వేపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపై ప్రజెంటేషన్ ఇస్తామని, డేట్, టైమ్, ప్లేస్ ఆయనే ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి రమ్మన్నా అధికారులను తీసుకొని వస్తానని, కిషన్ రెడ్డి అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే విజయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.