News August 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 7, 2025

వచ్చే వారంలో ట్రంప్, పుతిన్ భేటీ!

image

US ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలుత పుతిన్‌తో వ్యక్తిగతంగా సమావేశమవుతారని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి రష్యాతో సీజ్ ఫైర్‌పై చర్చిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘రష్యన్లు ట్రంప్‌ను కలవాలనుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

News August 7, 2025

AP న్యూస్ రౌండప్

image

☞ విశాఖలో రూ.35Crతో 5 ఎకరాల్లో థీమ్ పార్క్ ఏర్పాటు: మంత్రి దుర్గేశ్
☞ CM స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక్క <<17326231>>జడ్పీటీసీ<<>> స్థానం కోసం ఇంతగా దిగజారిపోతారా: YS జగన్
☞ స్కూళ్లలో ఈ నెల 11 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు
☞ సర్పంచ్, MPTC ఉప ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
☞ ఈ నెల 24న గ్రామ సర్వేయర్లకు శాఖాపరమైన పరీక్షలు

News August 7, 2025

DOST: స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి

image

డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. 54,048 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కామర్స్‌లో 22,328, ఫిజికల్ సైన్స్‌లో 12,211 మంది, లైఫ్ సైన్స్ 10,435, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది సీట్లు పొందారు. వీరంతా ఈనెల 8లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది మొత్తం 1.97 లక్షల మంది డిగ్రీ ఫస్టియర్‌ అడ్మిషన్లు పొందారని తెలిపారు.